close

తాజా వార్తలు

Published : 05/08/2020 08:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. రామచక్కని ఆలయం

ఊరూరా రామాలయం.. ఇంటింటా రామనామం.. ఈ దేశంలో సర్వసాధారణం. రామరాజ్యం అంటే ఆదర్శ పాలన. అందుకే స్వాతంత్య్రం తర్వాత రామరాజ్యం కావాలని గాంధీజీ కోరుకున్నారు.. రాముడి జన్మస్థలమైన అయోధ్యపై శతాబ్దానికి పైగా నడిచిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది.. అక్కడ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. హిందువుల చిరకాల స్వప్నం మరికొద్ది గంటల్లో సాకారం కానుంది. బాబ్రీ మసీదు కోసం దశాబ్దాలుగా పోరాడిన ఇక్బాల్‌ అన్సారీకి తొలి ఆహ్వానం అందజేయడం ఒక విశేషమైతే.. ఆలయ శంకుస్థాపనకు హాజరు కావడం రాముడి నిర్ణయంగా భావిస్తానని ఆయన చెప్పడం భారతీయ ఆత్మకు ప్రతీక. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సుందర.. సుదృఢ..

2. 14 వరకూ ఎక్కడివక్కడే

అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు విషయంలో ఈనెల 14వ తేదీ వరకూ యథాతథ స్థితి (స్టేటస్‌ కో) పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకటనలు, చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  సీఆర్‌డీఏ అధికారులకు, తదితరులకు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జమ్మూ-కశ్మీర్‌ పూర్తిగా మాదే!

భారత్‌పై పాకిస్థాన్‌ మరో రూపంలో అక్కసు వెళ్లగక్కింది. జమ్మూ-కశ్మీర్‌ పూర్తిగా, గుజరాత్‌లోని కొన్ని భూభాగాలు తమవేనంటూ తన దేశ కొత్త రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించింది! పాకిస్థాన్‌ మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపిన క్రమంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దీన్ని విడుదల చేశారు. అయితే రాజకీయ కుయుక్తిలో భాగంగానే పాక్‌ దీన్ని తీసుకొచ్చిందని భారత్‌ తూర్పారబట్టింది. ఆ పటానికి ప్రాంతీయ గుర్తింపుగానీ, అంతర్జాతీయ విశ్వసనీయతగానీ లేదని కొట్టి పారేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నీళ్ల సీసా కంటే తక్కువ ధరకే టీకా

నీళ్ల సీసా కంటే తక్కువ ధరలోనే కరోనా టీకా తీసుకొస్తామని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన టీకాను అందిస్తామని, భారత్‌లో పంపిణీ చేసేవి, విదేశాలకు ఎగుమతి చేసేవి ఒకే నాణ్యతతో ఉంటాయని స్పష్టం చేశారు. ‘‘టీకా అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించాం. కొవిడ్‌ వైరస్‌ కొత్తది కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయి. మేమంతా మార్కెట్‌లో పోటీదారులమే కావొచ్చు. మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘కొవాగ్జిన్‌’ రెండో దశ ప్రారంభం

5. ఒక్క మాస్కు.. 30 ఉతుకులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును తయారుచేశారు. మూడు, నాలుగు పొరలు కలిగి హైడ్రోఫోబిక్‌ పాలిమర్లతో బ్యాక్టీరియా, వైరస్‌లను సమర్థంగా నిలువరించేలా దీన్ని రూపొందించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్లలో 0.3 మైక్రాన్ల పరిమాణం వరకు ఈ మాస్కు నిలువరిస్తుంది. గరిష్ఠంగా 60 నుంచి 70 శాతం వరకు వైరస్‌ను అడ్డుకుంటుందని ఐఐసీటీ సీనియర్‌ ప్రిన్సిపల్‌ శాస్త్రవేత్త, ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భార్యలా కాదు... బానిసలా చూస్తున్నాడు!

నా వయసు 38. ఇద్దరు పిల్లలు. నేను పెద్దగా చదువుకోలేదు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా. మావారు ఎప్పుడూ నాతో సంతోషంగా మనసు విప్పి మాట్లాడింది లేదు. తనకు ఎప్పుడూ తన అమ్మానాన్న, తోబుట్టువులే ముఖ్యం. వాళ్లేమో తనతో మంచిగా ఉంటూ నన్నెప్పుడూ తిడుతూ ఉంటారు. ఆయన నన్ను భార్యలా కాకుండా బానిసలా చూస్తున్నాడు. నాపై చేయిచేసుకుంటున్నాడు. నాకు జీవితం అంటే విరక్తిగా అనిపిస్తోంది. మాటిమాటికీ చచ్చిపోవాలనిపిస్తోంది. పిల్లలను చూసుకునే బతుకుతున్నా? నాకేదైనా మార్గం చెప్పండి. తను నన్ను మంచిగా చూసుకోవాలని కోరుకోవడం తప్పా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నగరం కాదది..

ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతం కాదది! భారతీయ ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి. ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది... ఈ అయోధ్య! వేదాల నుంచి మొదలెడితే... పురాణాల దాకా అయోధ్య ప్రస్తావన కన్పిస్తుంది. ‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’ అంటూ... ఇది కేవలం నగరం కాదు... మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెప్పిన అయోధ్య గురించి... వాల్మీకి అద్భుతంగా వర్ణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

రాతి శిలల కార్ఖానా

8. చీకట్లో చిదిమేసింది..!

బంధువులను పలకరించి రాత్రివేళ ద్విచక్ర వాహనంపై అత్తవారింటికి పయనమైన ఓ యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. వ్యవసాయ పరికరాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొని, ఇనుప నాగలి గొంతుకు బలంగా గుచ్చుకుపోవటంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్‌(27) అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటి నుంచి తన అత్తగారు ఊరైన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌)కు వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దర్శనం.. మరింత ఆలస్యం

‘‘గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చింది’’.. అగ్ర కథానాయకుల సినిమాల విషయంలో తరచూ వినిపించే మాటిది.. మనసుకు నచ్చిన కథ దొరక్క కొన్నిసార్లు.. కథ దొరికినా దర్శకుడికి ఖాళీ లేక మరికొన్నిసార్లు.. ఒకవేళ అన్నీ ఒకే అయినా.. చిత్రీకరణల ఆలస్యాలు.. ఇలా కారణాలేవైనా సరే.. కొన్నిసార్లు కొందరు అగ్ర హీరోల్ని తెరపై చూసుకోవడానికి అభిమానులకు ఏళ్లకు ఏళ్లు నిరీక్షణే. ఏడాదికి ఒక్క చిత్రంతోనైనా మురిపిస్తాడనుకున్న కథానాయకుణ్ని రెండు మూడేళ్ల వరకు దర్శించుకునే వీలు కలగకపోవచ్చు. ఇప్పుడిలాంటి పరిస్థితే కొందరు అగ్ర హీరోల విషయంలో ఎదురవుతోంది. మరి వాళ్లెవరు.. వాళ్ల తాజా సినిమా విశేషాలేంటో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వివో ఔట్‌!

ఈ ఏడాదికి ఇండియన్‌ ప్రిమియర్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా చైనా కంపెనీ వివో వైదొలగనుంది. వివోతో పాటు స్పాన్సర్లందరినీ కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ఆదివారమే ప్రకటించిన సంగతి. అయితే సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ నేపథ్యంలో బోర్డు నిర్ణయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో 2020 ఐపీఎల్‌ స్పాన్సర్‌గా తప్పుకోవాలని వివో నిర్ణయించుకుంది. అయితే బీసీసీఐతో స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. ప్రస్తుతానికి ఈ ఏడాది టోర్నీకి మాత్రమే దూరమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.