close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/06/2020 10:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కక్షపూరితంగా అరెస్టు చేశారు: కళా వెంకట్రావు

అమరావతి: టీడీఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్టు చేయడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. బీసీ నాయకుడిని కక్షపూరితంగా అరెస్టు చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై ఏ రాజకీయ పార్టీ అయినా పోరాడుతుంది, ప్రశ్నిస్తుంది .. కానీ, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తగదన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరముందన్నారు. రాజకీయ కుట్రల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను వాడుకోవటం దారుణమన్నారు.

అచ్చెన్నాయుడి అరెస్టు దుర్మార్గం: సోమిరెడ్డి

టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఒకేసారి వందల మంది ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా? అని నిలదీశారు. బీసీలంటే ఇంత చులకన భావమా అని ఆక్షేపించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాజకీయ కుట్రలో భాగమే: ధూళిపాళ్ల

అచ్చెన్నాయుడి అరెస్టు రాజకీయ కుట్రలో భాగమేనని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడం కుట్ర కాదా? అని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి వివరణ కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తారా అని నిలదీశారు. బలహీన వర్గాల నాయకులను అణగదొక్కే కుట్రలో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.