close

తాజా వార్తలు

Updated : 03/12/2020 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎం పిరికిపందలా వ్యవహరిస్తున్నారు: తెదేపా

అమరావతి: ముఖ్యమంత్రి పిరికిపందలా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ నియంత్రించే యత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలపై ఏడాదిన్నరగా దాడులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. వివిధ వర్గాలపై దాడులు, అసెంబ్లీలోకి మీడియా నియంత్రణను ఖండిస్తూ అధినేత చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకూ కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా దాడులు ఆపి అసెంబ్లీలోకి అన్ని మీడియా ప్రతినిధులను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు. వాడుకుని వదిలేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న నేతలు.. కొవిడ్‌ సేవలు అందించిన వైద్యులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 723 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

చలో అసెంబ్లీ నేపథ్యంలో ముస్లిం సంఘాల నాయకులు, తెలుగుదేశం నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తెదేపా ఖండించింది. దాడులు, కక్షలు, వేధింపులు చుట్టూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, పోరాడితే అక్రమ అరెస్టులు చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు.  



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని