close

తాజా వార్తలు

Published : 23/09/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి?: చంద్రబాబు

అమరావతి: తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ అంశంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను తెదేపా, భాజపా తీవ్రంగా ఖండించాయి. తాజాగా డిక్లరేషన్‌ వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అన్యమతస్థుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా తెదేపా నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 

జగన్‌ డిక్లరేషన్‌ కోసం పట్టుబట్టాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టు వస్త్రాలిస్తే రాష్ట్రానికే అరిష్టమని అభిప్రాయపడ్డారు. అన్యమత ఆచారాలను కించపరచకూడదన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేయాలని వైకాపా నేతలు చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలపాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు.  

ఇదీ చదవండి..

‘ఏ మతంపైనా జగన్‌కు విశ్వాసం లేదు’


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.