close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 17/05/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి ఆ కాంబినేషన్‌ వస్తోందా?

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళ కథానాయకుడు సూర్యకు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలవుతుంది. సూర్య కథానాయకుడిగా కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో ఇప్పటివరకూ మూడు చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘బ్రదర్స్‌’, ‘బందోబస్తు’చిత్రాలు పర్వాలేదనిపించాయి. ఇప్పుడు మరోసారి సూర్య-ఆనంద్‌లు కలిసి ఓ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అది గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అయాన్‌’కు కొనసాగింపుగా కొత్త చిత్రం వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం సూర్య సుధ కొంగర దర్శకత్వంలో ‘ఆకాశం నీ హద్దురా ’ చేస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవిలో విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తనకు మాస్‌లో క్రేజ్‌ తీసుకొచ్చిన ‘సింగం’ దర్శకుడు హరితోనూ సినిమా చేయడానికి అంగీకరించారు సూర్య. మరో తమిళ దర్శకుడు వెట్రిమాన్‌తోనూ ఓ చిత్రం చేయనున్నారు. అంటే వీరి చిత్రాలు అయిపోయిన తర్వాతే సూర్య-ఆనంద్‌ల కాంబినేషన్‌లో సినిమా కుదిరే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.