close
Array ( ) 1

తాజా వార్తలు

మేడం.. మీరు వెళ్లొద్దు!

 టీచరు బదిలీతో బాలికల రోదన
 డీఈవో హామీతో విరమణ

కేతేపల్లి, న్యూస్‌టుడే: ఆమె తల్లిలా లాలించారు.. గురువులా బోధించారు.. ప్రభుత్వ ఫలాలు విద్యార్థినులకు అందేలా చొరవ చూపారు.. అందుకే ఆ ‘ఉపాధ్యాయిని’ అంటే బాలికలకు ఎంతో ఇష్టం.. ఆమె బదిలీపై వెళ్లిపోతే తమకు మళ్లీ ఆకలికేకలు తప్పవనుకున్నారో, తమను పట్టించుకునేవారు ఉండరనుకున్నారో కానీ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రత్యేకాధికారి నీలాంబరి బదిలీ అయితే గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దఎత్తున నిరసన తెలిపారు.. కొందరు రోదించారు. స్థానిక అధికారులు సమస్యను జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బాలికలు ఆందోళన చేస్తున్న బస్‌షెల్టర్‌ ప్రాంతం నుంచి 8 కి.మీ. దూరంలోని జాతీయ రహదారిపైకి వెళ్లి ఆందోళన చేసేందుకు పరుగులు తీశారు. కాదంబరిని తిరిగి అక్కడే కొనసాగిస్తామని డీఈవో భిక్షపతి ఫోన్‌ ద్వారా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.