
తాజా వార్తలు
శ్వేతవర్ణం దాల్చిన పీర్ పంజాల్ పర్వతశ్రేణులు
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ కశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంటోంది. కొద్ది రోజులుగా జోరుగా మంచు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్నాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణి ప్రాంతాలు మంచు ఖండాన్ని తలపిస్తున్నాయి. పూర్తిగా మంచుతో నిండిపోయిన పలు ప్రాంతాలు నూతన శోభతో ఆకట్టుకుంటున్నాయి. హిమాలయ శ్రేణిలో తక్కువ ఎత్తులో ఉండే పీర్ పంజాల్ పర్వత శ్రేణులు అందాల లోకంగా మారాయి. హిమపాతం ధాటికి కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై దట్టంగా ఏర్పడిన మంచు మేటలను యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు.
Tags :
జనరల్
జిల్లా వార్తలు