close

తాజా వార్తలు

Updated : 06/03/2020 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భయపెట్టిన భల్లూకం: మార్కెట్లన్నీ బేర్‌.. బేర్‌

894 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు పతనం దిశగానే పయనిస్తున్నాయి. భల్లూకపు పట్టులో మరింత చిక్కుకుపోయాయి. ఒక వైపు కరోనా భయాలు మరోవైపు యెస్‌ బ్యాంకుపై ఆందోళనలు వెల్లువెత్తడంతో  శుక్రవారం సూచీలన్నీ భారీ నష్టాలు చవిచూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 894 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో ఒకానొక సమయంలో 1,459 పాయింట్లు పడిపోయిన సూచీ చివరికి 893.99 లేదా 2.32 శాతం నష్టంతో 37,576.62తో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 279.55 (2.48%) పాయింట్లు కోల్పోయి 10,989.45 వద్ద స్థిరపడింది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) మారటోరియం విధిస్తూ కఠిన నిర్ణయాలు అమలు చేయడంతో యెస్‌ బ్యాంకు షేర్లు ఏకంగా 55 శాతం నష్టపోయి రూ.16.60 వద్ద ముగిశాయి. టాటా మోటార్స్‌ (9.5%), జెడ్‌ఈఈఎల్‌ (7.29), ఎస్‌బీఐ (6.48), టాటా స్టీల్‌ (6.44) షేర్లు నష్టపోయాయి. బజాజ్‌ ఆటో (1.53%), గెయిల్‌ (0.84), మారుతీ (0.43%), ఏసియన్‌ పెయింట్స్‌ (0.40), ఐచర్‌ మోటార్స్‌ (0.19) షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. షాంఘై, హాంకాంక్‌, సియోల్‌, టోక్యో స్టాక్‌ మార్కెట్లు 2 శాతం నష్టపోగా ఐరోపా సూచీలు ఉదయం నష్టాలతోనే ఆరంభమయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడేలో 32 పైసలు తగ్గి రూ.73.24 వద్ద కొనసాగుతోంది.



 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని