close

తాజా వార్తలు

Published : 03/02/2020 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వల్ప లాభాల్లోకి దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం నుంచే ఊగిసలాటలో మొదలైన మార్కెట్లు ముగిసే సమయానికి స్వల్ప లాభాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 136 పాయింట్లు లాభపడి 39,872 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 11,707 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.50 వద్ద కొనసాగుతోంది.  కేంద్రం శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రభావం మార్కెట్ల ఒడుదొడుకులకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఏషియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, నెస్ట్‌లే, బజాజ్‌, ఇండస్‌ఇండ్‌ షేర్లు లాభాల్లో పయనించగా.. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, యస్‌ బ్యాంకు, హీరో మోటర్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి. 


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని