close

తాజా వార్తలు

Published : 31/03/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1028 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

ముంబయి: భారత స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కరోనా భయం ఇంకా కొనసాగుతున్నప్పటికీ మదుపర్లు భారీ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ 1,028.17 పాయింట్లు లేదా 3.62 శాతం, లాభపడి 29,468.49 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ ఏకంగా 316.65 పాయింట్లు (3.82%) ఎగబాకి 8597.75 వద్ద ముగిసింది. 1495 కంపెనీల షేర్ల ధరలు పెరగగా 767 సంస్థల షేర్ల ధరల తగ్గుముఖం పట్టాయి. 150 కంపెనీల షేర్ల ధరల్లో మార్పు లేదు.

నిఫ్టీలో బీపీసీఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, గెయిల్‌ షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌, సిప్లా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నస్టాల్లో ముగిశాయి. ఇక ఆయా రంగాల సూచీలను పరిశీలిస్తే ఎనర్జీ 7 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఐటీ, ఫార్మా సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 2.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 3.5 శాతం పెరిగాయి.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని