close

తాజా వార్తలు

Updated : 01/04/2020 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మళ్లీ 29 వేల దిగువకు సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం లాభాలతో ఎగిసిన మార్కెట్లు బుధవారం మళ్లీ నేలచూపులు చూశాయి. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 29వేల దిగువకు చేరింది. ట్రేడింగ్‌ ముగిసేరికి 1,203.18 పాయింట్లు నష్టపోయి 28,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 343.95 పాయింట్లు కోల్పోయి 8,253 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.55 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్‌, ఇంధన, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడం, మరణాల సంఖ్య పెరగడం ప్రపంచమార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో ట్రేడ్‌ అవ్వడం మదుపరులను కలవరపెడుతోంది. దీనికి తోడు దేశీయంగానూ పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గిపోవడంతో బ్యాంకులకు మొండిబకాయిలు బెడద పొంచి ఉందన్న భయాలతో బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో  హీరోమోటో కార్ప్‌, బజాజ్‌ ఆటో, టైటాన్‌ కంపెనీ, బజాజ్‌ ఫైనాన్స్‌, గ్రాసిమ్‌ షేర్లు లాభాలు చవిచూశాయి. టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా, టీసీఎస్‌, యూపీఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని