close

తాజా వార్తలు

Updated : 21/01/2020 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరుసగా రెండో రోజూ నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్‌ ఆరంభం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు సాయంత్రం ముగిసే సమయం అదే పరిస్థితిని కొనసాగించాయి. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 205 పాయింట్లు నష్టపోయి 41,323 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12,169 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.17 వద్ద కొనసాగుతోంది. మదుపర్లు షేర్ల అమ్మకాలతో పాటు బడ్జెట్‌పై దృష్టి సారించడం సహా ఎలాంటి తాజా సానుకూల పరిణామాలు లేకపోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, భారత్‌ పెట్రోలియం, భారతీ ఎయిర్‌టెల్‌, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో పయనించగా.. టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలతో ముగిశాయి.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని