close

తాజా వార్తలు

Updated : 27/03/2020 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సెన్సెక్స్‌కు నష్టాలు.. నిఫ్టీకి లాభాలు

ముంబయి: కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌.. శుక్రవారం నష్టాలతో ముగిసింది.  సామాన్యుడికి ఊరట కల్పిస్తూ ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు మదుపరులను మెప్పించలేకపోయాయి. రేట్ల కోత, మార్కెట్‌లోకి రూ.3.74 లక్షల కోట్లు చొప్పించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు వారిని మెప్పించినా.. కొవిడ్‌-19 కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ట్రేడింగ్‌లో సుమారు 1700 పాయింట్ల లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌ చివరికి నష్టాలతో ముగిసింది.

సెన్సెక్స్‌ 131.18 పాయింట్లు నష్టంతో 29,815.59 వద్ద ముగియగా, నిఫ్టీ 18.80 పాయింట్ల స్వల్ప లాభంతో 8,660 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.27గా కొనసాగుతోంది. నిఫ్టీలో కోల్‌ ఇండియా, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

ఇదీ చదవండి..
సామాన్యుడికి ఆర్‌బీఐ ఊరట


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని