close

తాజా వార్తలు

Updated : 02/01/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగించాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచే లాభాల్లో మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 320 పాయింట్లు లాభపడి 41,626 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ 100 పాయింట్లు లాభపడి 12,282 వద్ద ముగిసింది. యూఎస్‌ డాలరుతో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ.71.31 వద్ద కొనసాగుతోంది. చైనా, అమెరికాల మధ్య జనవరి 15న వాణిజ్య ఒప్పందం జరగనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు జోరందుకున్నాయి. టాటా మోటర్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, వేదాంతా షేర్లు లాభాల్లో పయనించగా.. ఐచర్‌ మోటర్స్‌, బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం, సిప్లా, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టాలతో ముగించాయి. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని