close

తాజా వార్తలు

Published : 10/02/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్పనష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా అలముకొన్న నావెల్‌ కరోనా వైరస్‌ ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 9.19 సమయంలో సెన్సెక్స్‌ 111 పాయింట్లు నష్టపోయి 41,030 వద్ద  నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయి 12,065 వద్ద కొనసాగుతున్నాయి. చమురు, స్టాక్స్‌ నష్టపోతుండగా.. బంగారం కూడా మూడు రోజుల్లో తొలిసారి విలువ కోల్పోయింది. కరోనా మృతుల సంఖ్య సార్స్‌ను దాటేయడం.. ఇంకా అదుపులోకి రాకపోవడంతో చైనా మొత్తం భయాలు వ్యాపించాయి. ఆసియా, పసిఫిక్‌ మార్కెట్ల షేర్‌ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. జపాన్‌ మార్కెట్లు నిక్కీ 0.8శాతం, దక్షిణ కొరియాకు చెందిన కేవోఎస్‌పీఐ 1.4శాతం నష్టపోయాయి. మరోపక్క శుక్రవారం ట్రేడింగ్‌లో వాల్‌స్ట్రీట్‌, డోజోన్స్‌ కూడా నష్టాల్లో ముగిశాయి. 
దేశీయ మార్కెట్లో నిఫ్టీ లోహరంగ సూచీ 1.5శాతం నష్టపోగా.. టాటా స్టీల్‌ షేర్‌ ధర 3శాతం పతనమైంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, వేదాంత 1.5శాతం నష్టపోయాయి. యస్‌బ్యాంక్‌ షేరు 3శాతం విలువ పెరిగింది. నేడు కంపెనీ అసాధారణ జనరల్‌ మీటింగ్‌ నిర్వహించనుండటంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే రూ.10వేల కోట్లను సేకరించేందుకు కంపెనీ షేర్‌ హోల్డర్లు అనుమతి ఇవ్వడం సానుకూలంగా మారింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని