close

తాజా వార్తలు

Published : 23/09/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అకాలీదళ్‌కు పోటీగా అదే పేరుతో మరో పార్టీ

రెబల్‌ నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా ప్రకటన

చంఢీఘర్: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి పదవినే వదులుకున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ)కి స్వపక్షం నుంచే ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంకో ఒకటిన్నర ఏడాదిలో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రమంత్రి పదవినే త్యజించి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనుకుంటున్న అకాలీదళ్‌కు రెబల్‌ నేతలతో తలబొప్పి కట్టేలా ఉంది. శిరోమణి అకాలీదళ్ రెబల్‌ నాయకుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ పార్టీ పేరును శిరోమణి అకాలీదళ్‌(డెమోక్రాట్‌)గా రిజిస్టర్‌ చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ సుఖ్‌దేవ్‌ ధిండ్సా, ఆయన కుమారుడు ఎమ్మెల్యే పర్మిందర్‌ సింగ్‌ ధిండ్సాను గత ఫిబ్రవరిలో శిరోమణి అకాలీదళ్ కోర్‌ కమిటీ పార్టీ నుంచి తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, నాయకత్వంపై విమర్శలు, రెబల్ నేతలతో కలవడం వంటి కారణాలతో ఎస్‌ఏడీ అధినేత సుఖీబీర్‌ సింగ్‌ బాదల్‌ వారిపై వేటువేశారు. బహిష్కరణకు గురికావడానికి కొద్ది రోజుల ముందే.. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ప్రజాస్వామ్య పద్ధతిలో నడవడం లేదంటూ సుఖ్‌దేవ్‌, పర్మిందర్‌ సింగ్ పార్టీలోని తమ పదవులకు రాజీనామా చేశారు. 

బాదల్‌ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో ముఖ్యంగా సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ నిరంకుశ ధోరణితో వ్యవహరించడం వల్ల పంజాబ్‌ ప్రజల్లో శిరోమణి అకాలీదళ్ తమ ఉనికిని కోల్పోయిందని రెబల్‌ నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ ధిండ్సా వ్యాఖ్యానించారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ నాయకత్వంలో క్షోభపడిన, అవమానాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికీ తమ శిరోమణి అకాలీదళ్ (డెమోక్రాట్‌) పార్టీ అండగా ఉంటుందని, ప్రజల తరఫున పోరాడేందుకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఇతర సీనియర్‌ నేతలు, నిపుణులు, న్యాయవాదులతో చర్చించి చట్టబద్ధంగా తమ పార్టీ పేరును ఎన్నికల సంఘంలో నమోదు చేయించనున్నట్లు తెలిపారు. శిరోమణి అకాలీదళ్ (డెమోక్రాట్) రానున్న శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ), పంజాబ్‌ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సుఖ్‌దేవ్‌ ధిండ్సా వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.