close
Array ( ) 1

తాజా వార్తలు

A4 పేపర్లపై అఫిడవిట్లనే అనుమతిస్తాం: సుప్రీం 

దిల్లీ: కాగితం వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ క్షీణతను నివారించడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానంలో రోజువారీ కార్యకలాపాల్లో వాడే కాగితం వృథా కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం పేపర్‌ వాడకంలో ఏకరూపత తీసుకొచ్చేలా ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా న్యాయస్థానంలో సమర్పించే పిటిషన్లు, అఫిడవిట్‌లకు A4 పరిమాణం కాగితంలో రెండు వైపులా వాడేలా ఉండాలని స్పష్టంచేసింది. తాము నిర్దేశించిన విధంగా ఉన్న అఫిడవిట్లనే ఏప్రిల్‌ 1 నుంచి విచారణకు స్వీకరిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అంతర్గతంగా అన్ని స్థాయిల్లో సమాచారం కోసం ఇదే తరహా పేపర్లను వాడాలని సీజేఐ ఎస్‌ఏ బోబ్డే జనవరి 14న న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించారు.

మార్చి 5వ తేదీతో జారీచేసిన కొత్త సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో గురువారం ఉంచారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్‌ 1 నుంచి జ్యుడిషియల్‌ పరంగా ఇలాంటి పేపర్లనే అనుమతిస్తామని స్పష్టంచేశారు. పేపర్ల వాడకంలో ఏకరూపత తీసుకురావడంతో పాటు వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ దిశగా తీసుకున్న ఈ సమాచారాన్ని పంచుకున్నందుకు సంతోషంగా ఉందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ సర్క్యులర్‌ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సంజీవ్‌ ఎస్‌ కల్గాన్కర్‌ పేరుతో విడుదలైంది. ఇప్పటివరకు దేశంలోని న్యాయస్థానాల్లో లీగల్‌ సైజు,  A4కంటే పెద్ద పరిమాణం ఉన్న పేపర్లను మాత్రమే వాడుతూ వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి ఏ4 పేపర్లపై అఫిడవిట్‌లు, పిటిషన్లు దాఖలు కానున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.