close

తాజా వార్తలు

నేపాల్‌లో ఘోర ప్రమాదం..14 మంది మృతి

ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సింధుపాల్‌చౌక్‌ జిల్లాలో కాలిన్‌చౌక్‌ మందిరం నుంచి ఆదివారం ఉదయం 40 మంది యాత్రికులతో ఓ బస్సు బయలుదేరింది. డోలాఖా ఖాదీచౌర్‌- జిరి రోడ్డు మార్గంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి 500 మీటర్ల లోతులో పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కాలిన్‌చౌక్‌ మందిరం దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.