close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/05/2020 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వలస కార్మికులపై దూసుకెళ్లిన బస్సు  

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృతి

ముజఫర్‌నగర్‌: రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కార్మికులు మృతిచెందారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌కు చెందిన వలస కూలీలు  తమ స్వస్థలాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటనలు జరిగాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌-సహరాన్‌పుర్‌ రహదారిపై అదే రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు ఆరుగురు కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారంతా అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బిహార్‌కు చెందిన వీరంతా లాక్‌డౌన్‌ వేళ పంజాబ్‌ నుంచి తమ స్వగ్రామానికి కాలినడకన వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

 మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో ప్రమాదంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మంది కూలీలు దుర్మరణం చెందారు. బుధవారం మహారాష్ట్ర నుంచి సుమారు 60 మంది వలసకూలీలు లారీలో తమ స్వస్థలానికి బయలుదేరగా మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలోకి రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న లారీ మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా మరో 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.