
తాజా వార్తలు
భాజపా గెలుస్తుందనే భయంతోనే అల్లర్లు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తెరాస కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. తెరాస అనైతిక విలువలను పాటిస్తుందని కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా గెలుస్తుందనే భయంతోనే తెరాస నేతలు అల్లర్లకు పాల్పడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆరున్నరేళ్ల పాలనలో ఉన్న పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధిని చూపెట్టి ఓట్లు అడగాలని అన్నారు. నోట్లు,మద్యం పంపిణీతో ఓట్లు అడగడం సరికాదని, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఊడిగం చేయకూడదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నియమావళి ప్రకారం పనిచేస్తున్న అధికారులను అధికార పార్టీ నేతలు బదిలీలు చేయిస్తున్నారని ఆరోపించారు.
తెరాస నేతలు అవినీతికి పాల్పడితే రాష్ట్రమంతటా గ్రామ గ్రామాన ప్రజలు తిరగబడతారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.తెలంగాణ సమాజం ఎవరికీ లొంగి ఉండదని, నిర్బంధాలను తెలంగాణ ప్రజలు సహించరని కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస నేతలు దింపుడు కలలాగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న మొన్న వచ్చిన పార్టీ తెరాస.. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న జాతీయ పార్టీ భాజపా అని పేర్కొన్నారు.తెరాస నేతల మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కిషన్‌రెడ్డి సూచించారు.భాజపా నేతలపై దాడుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. డబ్బులు,మద్యం పంపిణీ చేస్తున్న తెరాస..నీతి వాక్యాలు చెబుతోంది ఎద్దేవా చేశారు. భాజపా నైతిక విలువలను పాటించే పార్టీ అని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి అన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- ముక్క కొరకలేరు!
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
