close

తాజా వార్తలు

Updated : 23/01/2020 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఏఏపై రాష్ట్రాల అసమ్మతి ‘రాజకీయకోణమే’

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు తీసుకురావడం పూర్తిగా ‘రాజకీయ కోణమే’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. పౌరసత్వం ఇవ్వడంలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదని అన్నారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్‌ సీఏఏపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రాలకు ఆ హక్కు లేదు..

‘జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌), ఎన్సార్సీ తయారీలో రాష్ట్రాలు క్రీయాశీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఈ ప్రక్రియలు చేపట్టేందుకు కేంద్రం దగ్గర సరిపడా సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రాల సిబ్బంది ఇందులో పాల్గొంటారు. అయితే పౌరసత్వం అనేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇచ్చేది. రాష్ట్రాలు ఆ పనిచేయలేవు. అందువల్ల వీటిని అమలు చేయడం చేయకపోవడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు. సీఏఏను అమలు చేయబోమని చట్టపరంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేవు. అయితే ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీ ప్రక్రియ చేపట్టబోమని మాత్రం చెప్పొచ్చు. ఇక సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు తీర్మానాలు తీసుకొస్తున్నాయి.. కోర్టులకు వెళ్తున్నాయి. నిజానికి అదంతా రాజకీయాల కోసం మాత్రమే. అవేవీ పనిచేయవు’ అని శశిథరూర్‌ చెప్పుకొచ్చారు. 

భాజపా తప్పులు ఒప్పుకోదు..

ఈ సందర్భంగా సీఏఏపై సుప్రీంకోర్టు తీర్పును కూడా థరూర్‌ ప్రస్తావించారు. పౌరసత్వ చట్టంపై దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. పౌరసత్వానికి మతంతో సంబంధం పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అని థరూర్‌ అభిప్రాయపడ్డారు. ‘ఈ చట్టం అమలు కాకుండా ఉండాలంటే కేవలం రెండే మార్గాలున్నాయి. ఒకటి.. సుప్రీంకోర్టు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం. రెండు.. ప్రభుత్వమే స్వయంగా దీన్ని రద్దు చేయడం. రెండోది ఎలాగూ సాధ్యపడదు. ఎందుకంటే భాజపా ఎప్పటికీ తన తప్పులను అంగీకరించదు’ అని థరూర్‌ విమర్శించారు. 

ఇటీవల కాంగ్రెస్‌ మరో నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్ సిబల్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీఏఏను పార్లమెంట్‌ ఆమోదించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని రాష్ట్రాలు చెప్పడం కుదరదు అని సిబల్‌ వ్యాఖ్యానించారు. తాజాగా శశిథరూర్‌ కూడా సీఏఏ అమలు పట్ల సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించిన విషయం తెలిసిందే. అంతేగాక, తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలోనూ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు తీసుకొస్తామని కాంగ్రెస్‌ సూచనప్రాయంగా ప్రకటించింది. అంతకుముందు కేరళ అసెంబ్లీ కూడా ఇదే తరహా తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. త్వరలోనే బెంగాల్‌ ప్రభుత్వం కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.  



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.