close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120021538 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => pDbKar9Z-eg [video_short_link] => pDbKar9Z-eg [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-14 15:43:47.111137 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 14/02/2020 15:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘రాహుల్‌.. మీ వ్యాఖ్యలు సిగ్గుచేటు’

విమర్శలకు దీటుగా బదులిచ్చిన భాజపా

దిల్లీ: పుల్వామా దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మన భద్రతా బలగాలను రాహుల్‌ అవమానిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని దుయ్యబట్టింది. 

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఆత్మాహుతి దాడి జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఆ ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జవాన్ల త్యాగాలను స్మరించుకున్న రాహుల్‌.. ట్విటర్‌ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ ఆ దాడితో ఎవరు ప్రయోజనం పొందారు..? భద్రతా లోపాలకు బాధ్యులు ఎవరు?’ అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాహుల్‌ విమర్శలకు భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు దీటుగా బదులిచ్చారు. ‘ఓ వైపు దేశమంతా పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తుంటే.. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరుడైన రాహుల్‌ గాంధీ మాత్రం విమర్శలకు దిగారు. కేవలం ప్రభుత్వాన్నే గాక, భద్రతా బలగాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దాడి వెనుక వాస్తవ కుట్రదారు అయిన పాకిస్థాన్‌ను ఆయన ఎన్నడూ ప్రశ్నించట్లేదు. ప్రశ్నించరు కూడా.. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది రాహుల్‌!’ అని జీవీఎల్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. 

భాజపా మరో అధికార ప్రతినిధి షానావాజ్‌ హుస్సేన్‌ స్పందిస్తూ.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను రాహుల్‌ అవమానిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ గతంలో కూడా ఇలాగే ప్రవర్తించిందని, అందుకే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాహుల్‌ చేసే ఇలాంటి వ్యాఖ్యలు.. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను తప్పుబట్టేలా పాక్‌కు ఉపయోగపడుతాయని ఆరోపించారు. 

ఇవీ చదవండి..

పుల్వామా దాడి: రాహుల్‌ మూడు ప్రశ్నలు

పుల్వామా అమరుల త్యాగాన్ని మర్చిపోం

ఉగ్రనాగును ఊరికే వదలం



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.