close

తాజా వార్తలు

దేశంలో హింసకు రాహుల్‌ చెప్పిన కారణం..!

వయనాడ్‌: దేశంలో పెరిగిపోతున్న హింసకు భాజపా ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మహిళలు, దళితులు, మైనారిటీలు, గిరిజనులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయన్నారు. తన నియోజకవర్గం వయనాడ్‌ పర్యటనలో ఉన్న ఆయన శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య భాజపా విద్వేషాలను రెచ్చగొడుతోందంటూ రాహుల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని.. కొంతమంది వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘హింస, విచక్షణారహిత విధానాల్ని విశ్వసించే వ్యక్తి’ ఈ దేశాన్ని పాలిస్తుండడమే వీటన్నింటికీ కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలపై జరిగిన ఆకృత్యాలను ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.