దివ్య హత్యకేసు.. మిస్టరీ వీడేనా..?
close

తాజా వార్తలు

Published : 16/06/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దివ్య హత్యకేసు.. మిస్టరీ వీడేనా..?

విశాఖ: విశాఖ నగరంలోని అక్కయ్యపాలెంలో సంచలనం రేపిన దివ్య హత్యకేసు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డబ్బుకోసం వసంత అనే మరో మహిళతో కలిసి దివ్యను వ్యభిచార వృత్తిలోకి నెట్టిన పిన్ని కాంతవేణి.. చివరికి ఈనెల 3న దివ్య ఉసురు తీసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కొన్నేళ్లుగా దివ్య కుటుంబంలో చోటుచేసుకున్న అనుమానాస్పద ఘటనలపై దృష్టి సారించారు.

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెంది ఈ కుటుంబంలో కొన్నేళ్ల కిందట దివ్య తండ్రి ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత చిన్నాన్న కూడా అదే రీతిలో కనిపించకుండా పోయాడు. వారిద్దరూ ఎందుకు.. ఎటుపోయారు? అసలు ఇళ్లు విడిచి వెళ్లడం అనే కథలో నిజం ఎంత? అనే విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియరాలేదు. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ సైతం 2014 జూన్‌లో కనిపించకుండా పోయారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ ముగ్గురూ హత్యకు గురైనట్లు అక్టోబర్‌లో తేల్చారు. వీరిని నల్ల మహారాజు అనే వ్యక్తి హత్య చేశాడని గుర్తించారు. అయితే, దివ్య తల్లి, తమ్ముడి మృతదేహాల ఆనవాళ్లు మాత్రం గుర్తించలేకపోయారు. దివ్య కుటుంబం ఛిన్నాభిన్నం కావడం వెనుక ఆమె పిన్ని కాంతవేణి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దివ్య తండ్రి, ఆ కొంత కాలానికే కాంతవేణి భర్త ఒకే తీరులో కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. ఆ తర్వాత దివ్య కుటుంబలో ముగ్గురూ కనిపించకుండా పోయినా.. చాలా రోజుల వరకు కాంతవేణి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని గుర్తించారు. ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఆయా హత్యకేసుల డొంకను ఛేదించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. దివ్య కుటుంబం మొత్తం ఇంత క్రూరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోవడానికి గల కారణాలు ఏంటి? అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని భావిస్తున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని