మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు
close

తాజా వార్తలు

Published : 09/06/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో రోజూ పెరిగిన పెట్రో ధరలు

దిల్లీ: చమురు సంస్థలు వరుసగా మూడోరోజు పెట్రో ధరలను పెంచాయి. ఇవాళ లీటర్ పెట్రోల్పై 54 పైసలు పెరగ్గా.. డీజిల్పై 58 పైసలు పెరిగింది. గత రెండ్రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై రూ.1.20 చొప్పున ధరలు పెరగ్గా.. ఇవాళ్టి పెంపుతో కలిపి పెట్రోల్ ధర రూ.1.74, డీజిల్ ధర రూ.1.78 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడాన్ని దృష్టిలో ఉంచుకొని మార్చి 14న పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం.. మే 6న పెట్రోల్ పై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర పెంచింది. ఫలితంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ వినియోగదారులకు ఆ ప్రయోజనం చేకూరలేదు. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతుండగా భారాన్ని మాత్రం చమురు సంస్థలు వినియోగదారులపై మోపుతున్నాయి.

తాజా ధరలతో దిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.73కాగా.. డీజిల్‌ ధర రూ.71.17; కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.74.98, డీజిల్‌ ధర రూ,67.23; ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 80.01 కాగా.. డీజిల్‌ ధర 69.92; చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.77.08, డీజిల్‌ ధర రూ.69.74గా ఉంది.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని