close
Array ( ) 1

తాజా వార్తలు

నిరసన తెలపడం హక్కే, కానీ..: సుప్రీం

దిల్లీ: నిరసన తెలియజేయడం ప్రజల ప్రాథమిక హక్కే అయినప్పటికీ రోడ్లను నిర్బంధించడం అనేది ఆందోళనకర అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సమతూకం అవసరమని షహీన్‌బాగ్‌ నిరసనకారులనుద్దేశించి వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ దిల్లీలోని షహీన్‌ బాగ్‌లో గత రెండు నెలలుగా కొందరు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా నిరసన పేరుతో రోడ్లను నిర్బంధించడంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

అభిప్రాయాలను వ్యక్తీకరించడంపై ప్రజాస్వామ్యం పనిచేస్తుందని, అయితే, అందుకు కొన్ని హద్దులుంటాయని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం పేర్కొంది. షహీన్‌ నిరసనకారులతో మాట్లాడేందుకు మధ్యవర్తులుగా సీనియర్‌ న్యాయవాదులు సంజయ్‌ హెగ్డే, సాధన రామచంద్రన్‌ను నియమించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగని చోట నిరసన తెలిపేలా నిరసనకారులను ఒప్పించాలని సూచించింది. ఒకవేళ ఫలితం లేకుంటే నిర్ణయాధికారం అధికారులకే వదిలేస్తామని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.