close

తాజా వార్తలు

Updated : 14/08/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో రూ.9కోట్లతో పరకామణి భవనం

తిరుమల: తిరుమలలోని వెంగమాంబ అన్నదాన కేంద్రం సమీపంలో శ్రీవారి పరకామణి భవనం నిర్మాణానికి తితిదే శ్రీకారం చుట్టింది. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం నూతన భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడుతూ... ఆలయ ఆవరణలో ఉన్న పాత పరకామణి భవనంలో శ్రీవారి కానుకలు, హుండీ లెక్కింపునకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. 

దాదాపు పదిహేనువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.8.90కోట్ల వ్యయంతో ప్రత్యేక భవనం నిర్మించాలని పాలకమండలి నిర్ణయించినట్లు చెప్పారు. హుండీ, విరాళాల లెక్కింపు ఒకే ప్రాంగణంలో నిర్వహించే లక్ష్యంతో అధునాతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తులు స్వామివారికి సమర్పించుకొన్న కానుకల లెక్కింపు విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా భవన నిర్మాణాలను రూపొందిచినట్లు తెలిపారు. తాడేపల్లిగూడెంకు చెందిన బెంగళూరులో స్థిరపడ్డ వ్యాపారి మురళీకృష్ణ పరకామణి భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని విరాళంగా అందజేసినట్లు ఛైర్మన్‌ వెల్లడించారు. భూమి పూజ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌తో పాటు దాత మురళీకృష్ణ, అదనపు ఈఓ ధర్మారెడ్డి పాల్గొన్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.