close

తాజా వార్తలు

Updated : 08/03/2020 22:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నారీశక్తి పురస్కారం అందుకున్న తెలుగు మహిళ

దిల్లీ: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే నారీశక్తి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం దిల్లీలో అట్టహాసంగా జరిగింది. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలను ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. 2019 సంవత్సరానికి గానూ పలువురు మహిళలకు నారీశక్తి పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతుల మీదుగా అందజేశారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన పడాల భూదేవి పురస్కారం అందుకున్నారు. 1996లో తన తండ్రి స్థాపించిన ఆదివాసి వికాస్ సొసైటీ ద్వారా గిరిజన మహిళలు, వితంతువులు, పోడు భూముల అభివృద్ధికి చేస్తున్న కృషికి గానూ ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. 
భూదేవితో పాటు బినా దేవి, అరిఫ్‌ జాన్‌, చామి ముర్ము, నిల్జా వాంగ్మో, రష్మీ ఉర్దువర్దేశి, మన్‌కౌర్‌, కళావతి దేవి, కౌషికి చక్రవర్తి, అవని చతుర్వేది, భవనకాంత్‌, మోహనసింగ్‌, భగీరథి అమ్మ, కార్తియాని అమ్మ పురస్కారాలు అందుకున్నారు. ఈ ప్రధానోత్సవంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు ఆయన సతీమణి సవితా కోవింద్‌, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, స్మృతీ ఇరాని కూడా ఉన్నారు.

దీ చదవండి

చదువుల తల్లి మురిసిపోదా..!

 

 




Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని