close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/04/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా పరీక్షలు లక్షకు పెంచండి: రాహుల్‌

దిల్లీ: దేశంలో కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా పోరుకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని చెప్పారు. నిపుణులు సైతం ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారని రాహుల్‌ పేర్కొన్నారు. దేశంలో రోజుకు సగటున 40వేల కొవిడ్‌-19 పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని, ఆ సంఖ్యను లక్షకు పెంచాలని కోరారు. పరీక్షలకు సరిపడా కిట్లు దేశంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ విషయంలో ప్రతిబంధకాలను అధిగమించి సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీకి విన్నవించారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్‌ సైతం ఇదే విషయం స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..
కరోనా కట్టడికి అదొక్కటే మార్గం: మన్మోహన్‌
ఇల్లు చేరడానికి ఓ కూలీ ఉ‘ల్లి’పాయం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.