close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/05/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండో ఉద్దీపన పథకంపై మోదీ కసరత్తు!

కీలక శాఖలతో వరుస సమావేశాలు

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ శనివారం కీలక మంత్రిత్వ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక, వాణిజ్య శాఖల సీనియర్‌ అధికారులు సైతం వీటిలో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌తో కుదేలైన పారిశ్రామిక రంగం కోసం రెండో ఉద్దీపన పథకాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారని అభిజ్ఞవర్గాలు అంటున్నాయి.

కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మోదీ సమావేశమయ్యారు. సూక్ష్మ్‌, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎఈ) పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులూ ఇందులో పాల్గొన్నారని తెలిసింది. జీఎస్‌టీ వసూళ్ల వివరాల ప్రకటనను ఆర్థికశాఖ శుక్రవారం వాయిదా వేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, భారత ఆర్థిక వ్యవస్థను పుంజుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

వైమానిక, కార్మిక, విద్యుత్‌ సహా మరికొన్ని శాఖలతో మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. వాణిజ్య, ఎంఎస్‌ఎంఈ శాఖలతో గురువారం చర్చించారు. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వారితో సమావేశమయ్యారు. చిన్న వ్యాపారాలు వేగంగా కోలుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ సమావేశాల్లో హోం, ఆర్థిక మంత్రులు సైతం పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ కష్టాలను అధిగమించేందుకు ప్రభుత్వం మార్చిలో రూ.1.7 లక్షల కోట్లతో ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. ఇది బడుగు, బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించింది. అయితే పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం దక్కలేదు.  వ్యాపారాలన్నీ నష్టపోతున్నాయని సాయం చేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతుండటంతో ప్రభుత్వం రెండో ఉద్దీపన పథకంపై కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

చదవండి: అమెరికాలో భారత ఔషధాన్నే మొదట వాడుతున్నారు

చదవండి: ట్రంప్‌ విమర్శిస్తున్నా చైనాను ప్రశంసించిన డబ్ల్యూహెచ్‌వో


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.