close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

ఇకపై నృత్యాలన్నీ.. ఇలాగే ఉంటాయేమో!

దాదాపు రెండునెలల లాక్‌డౌన్‌ విరామం అనంతరం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాల్లెట్‌ కంపెనీకి చెందిన నృత్య సాధకులు ఇలా ముఖానికి మాస్కులు, కవచాలు ధరించి, భౌతికదూరం పాటిస్తూ తొలిరోజు సాధనలో పాల్గొన్నారు.


‘ఆపరేషన్‌ బ్లూస్టార్‌’@ 36

అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగి 36 సంవత్సరాలు దాటింది. ఈ సందర్భంగా కొన్ని సిక్కు రాడికల్‌ సంస్థల ప్రతినిధులు భారీసంఖ్యలో స్వర్ణదేవాలయంలోకి ప్రవేశించడానికి యత్నించారు. లాక్‌డౌన్‌ నిబంధనల కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీలేక కొద్దిమంది మాత్రమే అమరులకు నివాళులర్పించి వెనుదిరిగారు.


మీసంతో రాని చిక్కు.. మాస్కుతో వచ్చిందే!

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గిరిధర్‌ వ్యాస్‌. రాజస్థాన్‌లోని బికనేర్‌కు చెందిన ఈయన మీసాల పొడవు అచ్చంగా 28అడుగులు. దేశంలోనే అంత్యంత పొడవైన మీసాలు కలిగిన వ్యక్తిగా ఘనత పొందిన గిరిధర్‌కు ఇప్పుడు కరోనా చిక్కుముడి తెచ్చిపెట్టింది. ఎంత పొడవాటి మీసాలనైనా మెలేసి చుట్టేసే ఇతగాడికి మాస్కు పెట్టుకోవడానికి మాత్రం మరో వ్యక్తి సాయం కావాల్సి వస్తోంది. 


ఆఫ్రో-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధువులు ధూపం వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


బ్యానర్‌ కడదాం.. జెండా ఎగురేద్దాం!

ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రశ్నలతో కూడిన ఓ భారీ బ్యానర్‌ను తయారు చేయించారు. దీనిని సొంతంగా ఆయనే పట్నాలోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట నిచ్చెన సాయంతో పైకి ఎక్కి కట్టారు. బిహార్‌లోని పార్టీ శ్రేణులంతా గ్రామాలు మొదలుకొని మహానగరాల వరకూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇలాంటి బ్యానర్లు ఏర్పాటు చేయాలని తేజస్వీ పిలుపునిచ్చారు.


‘పూసింది.. పుష్కర‘మే’

చిత్తూరు జిల్లా వెంకటేశ్వర కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి తన ఇంటి లోగిలిలో పెంచుకుంటున్న మే పుష్పం విరబూసి చూపరులను ఆకట్టుకుంటోంది. ఏడాదికి ఒకసారి గ్రీష్మరుతువులో మాత్రమే పూయడం దీని ప్రత్యేకత. పుష్కరకాలంగా ఈ మొక్కను పెంచుతున్నట్లు భాస్కర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. 


‘ఆటో’ఇటో వెళితేనే బతుకుబండి సాగేది!

పార్శీగుట్టకు చెందిన ఈ మహిళా ఆటోడ్రైవర్‌ పేరు మాధవి. లాక్‌డౌన్‌ కారణంగా చాలా రోజుల నుంచి ఆమె ఆటోను బయటకు తీయలేదు. దీంతో ఫైనాన్స్‌ వ్యాపారుల నుంచి ఆటోకు చెల్లించాల్సిన వాయిదాలు కట్టాలని ఒత్తిడి ఎక్కువైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా కవర్లను అడ్డుగా ఏర్పాటు చేసుకుని బతుకుబండి సాగిస్తున్నానని మాధురి పేర్కొంది. 


అప్రమత్తతే శ్రీరామరక్ష 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ సేవలు కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని దంత వైద్యశాలలో డాక్టర్‌ కె.సుశీల పీపీఈ కిట్లు ధరించి రోగులను పరీక్షిస్తున్నారు. ఆస్పత్రిలోని సహాయక సిబ్బంది కూడా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.


ఉడతా.. నీ భరతం పడతా!

ఇందిరాపార్కులో ఓ వడ్రంగిపిట్ట గింజల కోసం వాలింది. అవే గింజలు తినేందుకు అటుగా ఓ ఉడత వచ్చింది. అప్రమత్తమైన వడ్రంగిపిట్ట వెంటనే దానిని ముక్కుతో పక్కకు నెట్టడంతో ఉడత తుర్రుమంది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.