close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/06/2020 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో సోమవారం నుంచి పరిమిత సంఖ్యలో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వద్ద బారులు తీరిన ప్రయాణికులను చిత్రంలో చూడొచ్చు. ఆరోగ్య పరీక్షలు చేశాక సమస్యలు లేని వారినే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. దీంతో రైలు బయలుదేరే సమయానికి 90-120 నిమిషాల ముందే ప్రయాణికులు రైల్వేస్టేషన్లకు రావాలని రైల్వేశాఖ సూచించింది. 


వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ద్విచక్ర వాహనంపై చల్లటి నీటి బాటిళ్లను ఏర్పాటు చేసుకుని గుంటూరు నగరంలో దారిన పోయేవారి దాహం తీరుస్తున్న యువకుడు. ఈ విధంగా సంచార చలివేంద్రాన్ని తన తల్లిదండ్రుల పేరుతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాడు.


ప్రత్యేక రైళ్లు ప్రారంభమవ్వడంతో దిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరే రైలులో కూర్చున్న ప్రయాణికులు.


లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపుతో దిల్లీలో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద బారులు తీరిన వాహనాలు.


పర్యటక కేంద్రాలను తెరవాలని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో జైపుర్‌లోని జంతర్‌ మంతర్‌ను శుభ్రం చేస్తున్న కార్మికులు.


 గంగా దసరా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నదిలో పూజలు చేస్తున్న మహిళ.


ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే శాఖ ఉచితంగా పంపిణీ చేసిన ఆహారం కోసం గొడవపడుతున్న వలస కార్మికులు.


దేశంలో అరుదుగా పండే డ్రాగన్‌ ఫ్రూట్‌ను సిద్దిపేట జిల్లా మామిడాల గ్రామంలో పండిస్తున్నారు.  పౌష్టిక విలువలు, ఔషద గుణాలున్న ఈ పండుకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీని సాగులో ఖర్చు తగ్గించుకునేందుకు రైతు పాతిన స్తంభాలపై సిమెంట్‌ పలకలకు బదులుగా పాత టైర్లను ఇనుప చువ్వల ఆధారంతో ఇలా ఏర్పాటు చేశారు.


లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్‌ కేంద్రాలు మూతపడ్డాయి. వీటిని తిరిగి తెరవాలని కోరుతూ కోల్‌కతాలో బాడీ బిల్డర్లు, ఫిట్‌నెస్‌ బోధకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.


లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపుతో గువాహటిలో రహదారి పక్కన ఏర్పాటు చేసిన దుకాణంలో వస్త్రాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు.


సుమారు రెండు నెలల అనంతరం చెన్నైలో ఆటోలకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ప్రయాణికుల కోసం వేచి చూస్తున్న ఆటో డ్రైవర్‌.


అమెరికాలో జాతి సమానత్వం కోసం ఉద్యమిస్తున్నవారికి సంఘీభావంగా ఎస్‌యూసీఐ(సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టి బొమ్మను దగ్దం చేస్తున్న దృశ్యం.


లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన అనంతరం దిల్లీలో పానీపూరి తింటున్న వ్యక్తి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.