close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 15/05/2020 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

లాక్‌డౌన్‌ వేళ పరీక్షలు రాస్తున్నారు ఏంటా అనుకుంటున్నారా? వారి చేతిలో ఉన్నది జవాబు పత్రాలే కానీ వారు రాసేది పరీక్ష కాదు. తిరుపతి ఎస్వీ జూనియర్‌ కళాశాలలో భౌతిక దూరం పాటిస్తూ ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన చేస్తున్నారు అధ్యాపకులు.


జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకుండా చిత్తూరు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. నగరంలోని పలు కూడళ్లలో ‘సింహాలు సింగిల్‌గా వస్తాయి.. మరీ మీరు’ అని రాసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తుంటే మీరు సింహంలా ఉండాలని, కరోనా బారిన పడొద్దని సూచిస్తున్నారు.


కర్నూలు టౌన్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకన చేసేందుకు వచ్చే అధ్యాపకులకు అందించేందుకు మాస్క్‌లు, శానిటైజర్లు సిద్ధం చేస్తున్న దృశ్యం.


సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు టైర్‌ పంక్చర్ అయి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 


హైదరాబాద్‌: ఎండ తీవ్రతతో ఉప్పల్‌ చెరువు ఎండింది. చెరువు మధ్యలో ఉన్న బురదకుంటలో కొందరు నడుము లోతు దిగి చేపలు పడుతున్నారు. ఆ చేపలు ప్రమాదకరమైన ‘క్యాట్‌ ఫిష్‌’. అంతర్‌ చిత్రంలో పట్టుకున్న చేపలను చూడొచ్చు.


ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా పింఛన్‌ తీసుకునేందుకు అమ్మ, అమ్మమ్మతో యాదాద్రి జిల్లా పోచంపల్లి నుంచి ఉప్పల్‌ చిలకా నగర్‌ బయలుదేరాడు యువకుడు. తాత మిలటరీలో పని చేశాడు. ఆయన పింఛన్‌ ఇప్పుడు అమ్మమ్మకు వస్తుంది. సాధారణంగా తల్లిని వెంటబెట్టుకుని వచ్చేది కూతురు ప్రేమలత. లాక్‌డౌన్‌తో వాహన సదుపాయం లేక ఇలా ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో ఎండవేడి నుంచి ఉపశమనం కోసం తల్లికి చెరకు రసం తాగిస్తుంది.  


చెన్నై నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులను వారి స్వస్థలాలకు తరలించే బస్సులపై సోడియం హైపో క్లోరైడ్‌ రసాయనాన్ని పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది.


ఉత్తర్‌ప్రదేశ్‌ ఫతేపూర్‌లో ఎండ వేడిని తట్టుకోలేక పైపుతో ముఖంపై నీటిని పోసుకుంటున్న యువకుడు.


దిల్లీ-ఘాజీపూర్‌ సరిహద్దులో స్వస్థలానికి వెళ్లేందుకు అతికష్టమ్మీద లారీ ఎక్కుతున్న వలస కూలీలు.


ప్రత్యేక రైలులో స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు జబల్పూర్‌ రైల్వే స్టేషన్‌లో మంచినీటిని అందిస్తున్న రైల్వే సిబ్బంది.


పరిమిత ఆంక్షలతో దుకాణాలు తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో పన్వెల్‌లోని ఓ వస్త్ర దుకాణంలో బొమ్మలను శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది. 


ముంబయి రైల్వే స్టేషన్‌లో గుమికూడిన వలస కూలీలను నియంత్రించేందుకు లాఠీఛార్జీ చేస్తున్న పోలీసులు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.