ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌
close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:09 IST

ఓయూ పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌

హైదరాబాద్‌: వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 27 నుంచి నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి నవంబరు 1 వరకు పరీక్షలు నిర్వహించేలా సవరించిన షెడ్యూలును ప్రకటించింది. పరీక్షలు నేటి నుంచి జరగాల్సినప్పటికీ.. వర్షాల కారణంగా వాయిదా పడ్డాయి. మరోవైపు పీజీ ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీకి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించే గడువు ఈ నెల 23 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కిషన్ తెలిపారు. ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన, జేఎన్ టీయూహెచ్‌లోని ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నవంబరు 6న సీపీజీఈటీ జరగనుంది. ఆలస్య రుసుము రూ.500 చెల్లించి ఈనెల 29 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని