close

తాజా వార్తలు

Published : 20/07/2020 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరో ఆలోచన లేదు: భారత్‌

దిల్లీ: డిజిటల్‌ మాధ్యమం ద్వారా దేశంలో వస్తుసేవల విక్రయాలు నిర్వహిస్తున్న విదేశీ సంస్థలపై పన్నులు విధించాలనే నిర్ణయంపై వెనుకడుగు వేసేది లేదని భారత్‌.. అమెరికాకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, తమ దేశానికి చెందిన కొన్ని సంస్థలను ఇరుకున పెట్టేందుకే భారత్‌ ఈ నిర్ణయానికి వచ్చిందనే అగ్రరాజ్య ఆరోపణలను.. భారత్‌ ఖండించింది. భారత్‌లో ఆన్‌లైన్‌ ద్వారా వస్తుసేవల విక్రయాలను కొనసాగించే విదేశీ సంస్థలకు ఈ పన్ను వర్తిస్తుంది. ‘ఈక్వలైజేషన్‌ లెవీ’ అనే ఈ పన్నును భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా ప్రవేశపెట్టారు. కాగా, ఈ పన్ను ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో.. అమెజాన్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలపై ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని భారత్‌ కావాలనే తీసుకుందని అమెరికా సందేహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా భారత్‌ నిర్ణయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు ఆ దేశం తెలిపింది. భారత్‌తో సహా పది దేశాలు తమ దేశానికి చెందిన సంస్థలపై పక్షపాత వైఖరిని అనుసరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు అగ్రరాజ్యం దర్యాప్తు సంఘాలను ఏర్పాటు చేసింది. కాగా, ఇప్పటి వరకు పన్నుల పరిధిలోకి రాని ఆన్‌లైన్‌ లేదా ఈ-కామర్స్‌ కార్యకలాపాల వల్ల ఆదాయాన్ని కోల్పోతున్న భారత్‌కు... ఈ నిర్ణయం కాస్త ఊరట కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఉచిత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌) గురించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలువడిన భారత్‌ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.