close

తాజా వార్తలు

ఉద్యోగినుల మెనోపాజ్‌ విధానమేమీ లేదు: స్మృతి

దిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు సంబంధించి మెనోపాజ్‌పై ప్రభుత్వానికి విధానమేమీ లేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. లోక్‌సభలో శుక్రవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. ఒకవేళ విధానం రూపొందిస్తే మహిళలు, నిపుణుల నుంచి జాగ్రత్తగా సలహాలు స్వీకరించాల్సి ఉంటుందన్నారు. మెనోపాజ్‌ వల్ల మహిళా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుసుకొనేందుకు పరిశోధన ఫలితాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళా ఉద్యోగులకు సంబంధించి మెనోపాజ్‌ విధానమేమీ లేదు’ అని స్మృతి చెప్పారు. కొన్ని హార్మోన్లు తగ్గడంతో ప్రతి మహిళా 45-55 ఏళ్ల వయసులో సహజంగానే మెనోపాజ్‌ దశను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ దశలో అండాలు చైతన్యరహితం అవుతాయి. ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా రుతుక్రమం నిలిచిపోతుంది. ప్రత్యేక కారణాలేమీ లేకుండా ఒక ఏడాదిపాటు రుతుక్రమం ఆగిపోతే మెనోపాజ్‌ అంటారని మంత్రి తెలిపారు.

మెనోపాజ్‌ దశలో కొందరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొందరు కొద్దిపాటి ఇబ్బందులు పడతారని స్మృతి ఇరానీ వెల్లడించారు. మరికొందరిలో మాత్రం తీవ్రమైన శారీరక సమస్యలు కనిపిస్తాయన్నారు. ఇది మహిళలు తమ జీవితంలో తప్పక అనుభవించాల్సిన శారీరక మార్పని తెలిపారు. నాణ్యమైన వైద్యసేవలు అందరికీ సమానంగా అందుబాటులోకి తేవడమే జాతీయ ఆరోగ్య కార్యక్రమం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) లక్ష్యమన్నారు. పునరుత్పత్తి, తల్లి, నవజాత శిశువు, శిశువు, కౌమరుల ఆరోగ్యమనే ఐదు అంశాల ద్వారా సమగ్ర రక్షణ వ్యూహం అమలు చేస్తామన్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.