close

తాజా వార్తలు

Updated : 05/02/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బ్రెగ్జిట్‌పై చర్చిస్తే వాళ్లు ఊరుకుంటారా?:వెంకయ్య

దిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంట్‌లో ఇటీవల భారత్‌ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకొచ్చి చర్చించిన విషయాన్ని శివసేన ఎంపీ అనిల్‌ దేశాయ్‌ రాజ్యసభలో ప్రస్తావించారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘నేను స్పష్టంగా ఒకటే చెబుతున్నా. భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు విదేశాలకు లేదు. ఇది నేను రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలోనే కాదు దేశ ఉపరాష్ట్రపతిగా కూడా చెబుతున్నా. ఇక్కడి విషయాలేవైనా భారత పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు. విదేశాలు తమ దేశాల్లో జరుగుతున్న విషయాల గురించి పట్టించుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. భారత పార్లమెంటులో బ్రెగ్జిట్‌ గురించి చర్చిస్తే వాళ్లు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలోనూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత్‌ అంతర్గత వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం తగదని హెచ్చరించారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని