close

తాజా వార్తలు

Published : 02/12/2020 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో 7వేలు దాటిన కరోనా మరణాలు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు 7వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ బారినపడి ఏడుగురు బాధితులు మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 7,003కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 56,988 నమూనాలను పరీక్షించగా 663 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,69,412కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 1,159 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,01,66,696 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని