కరోనా ఎక్స్‌ప్రెస్‌ అని ఎప్పుడూ అనలేదు: దీదీ
close

తాజా వార్తలు

Published : 11/06/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎక్స్‌ప్రెస్‌ అని ఎప్పుడూ అనలేదు: దీదీ

కోల్‌కతా: శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను తానెప్పుడూ కరోనా ఎక్స్‌ప్రెస్‌లు అని పిలవలేదని పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లను కరోనా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అనడం ద్వారా వాటిని ఆమె అవమానించారంటూ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన ఆరోపణల్ని దీదీ తోసిపుచ్చారు. వచ్చే ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వర్చువల్‌ ర్యాలీ సందర్భంగా ఆయన బెంగాల్‌ ప్రజల్ని కోరారు. దీనిపై మమత స్పందిస్తూ.. 11లక్షల మందికి పైగా వలస కూలీలు బెంగాల్‌కు వచ్చారని తెలిపారు. సామాన్య ప్రజలు ‘కరోనా ఎక్స్‌ప్రెస్‌లు’ అనుకుంటున్నారని మాత్రమే చెప్పానన్నారు. కావాలంటే తన స్టేట్‌మెంట్‌ను చూసుకోవచ్చన్నారు. 

బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు షిఫ్ట్‌ల పని విధానం 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు బెంగాల్‌ సర్కార్‌ షిఫ్టుల పని విధానం ప్రకటించింది. పని ప్రదేశాల్లో రద్దీని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు తొలి షిఫ్ట్‌ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, రెండో ఫిఫ్ట్‌ మధ్యాహ్నం 12.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటుందన్నారు. షిఫ్ట్‌ల విధానం గురువారం నుంచి అమలులోకి రానుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ప్రజలంతా భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతిందనీ.. ప్రజల చేతుల్లో డబ్బులు లేనందున ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని సూచించారు. జూన్‌ 30 వరకు రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోవన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని