close

తాజా వార్తలు

Published : 05/08/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం: చంద్రబాబు

ఎన్నికల ముందు జగన్‌ ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్‌లో విలేకర్లతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. వైకాపా నాయకులు ఎలా మాట తప్పారో ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. జగన్‌, వైకాపా నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో వినిపించారు. రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం ఇవాళ జరుగుతోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. నోవావాక్స్‌ వ్యాక్సిన్‌.. ఆశాజనక ఫలితాలు

ప్రపంచాన్ని కొవిడ్‌ వణికిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనక ఫలితాలను చూపించడం మానవాళికి ఊరట కలిగిస్తోంది. తాజాగా అమెరికా బయోటెక్‌ కంపెనీ నోవావాక్స్‌ తమ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ బలమైన రోగనిరోధక శక్తి ఇస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కోలుకున్న రోగులలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రతినిరోధకాలను ఇది ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. వ్యాక్సిన్‌ విజయంపై ఇది ఆశలను పెంచుతోందని పేర్కొంది. ప్రారంభ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను విశ్లేషించి ఆ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీలో అత్యధికంగా కరోనా పరీక్షలు: ఆళ్ల నాని

రాష్ట్రంలో కొవిడ్ నివారణ కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా అత్యధిక కరోనా పరీక్షలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. కడప జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్‌లో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డికి బెయిల్‌

వాహనాల రిజిస్ట్రేషన్‌ అక్రమాల కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌ -4గా రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో వీరిద్దరిని పోలీసులు గతంలో హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
5. PICS: బీరుట్‌ బ్లాస్ట్‌ తర్వాత...

  

6. కీళ్లవాతం డ్రగ్‌తో కొవిడ్ నుంచి త్వరగా విముక్తి!

కీళ్లవాతానికి వాడే టొసిలిజుమాబ్‌ డ్రగ్‌ కొవిడ్‌-19 నుంచి త్వరగా కోలుకొనేందుకు ఉపయోగపడుతోందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా విశ్వవిద్యాలయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఫలితంగా ప్రాణవాయువుపై ఆధారపడే, ఆస్పత్రిలో చికిత్సా కాలం గణనీయంగా తగ్గుతోందని పేర్కొన్నారు. 87 మందిపై చేసిన అధ్యయనం ఫలితాలను ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. TTD: రేపు ఆన్‌లైన్‌లోకి కల్యాణోత్సవం టికెట్లు

గురువారం ఉదయం 11గంటలకు ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 7వ తేదీ నుంచి నెలాఖరుకు కోటాను అందుబాటులో ఉంచనుంది. టికెట్లను నమోదు చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో కల్యాణోత్సవం జరగనుంది. తపాలా శాఖ ద్వారా భక్తులకు కల్యాణోత్సవం అక్షింతలు, వస్త్రాలను తితిదే పంపనుంది. ఎస్వీబీసీ ఛానెల్‌ ద్వారా కల్యాణోత్సవం సేవ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

8. కరోనాకు ముగింపు అప్పుడే: బిల్‌గేట్స్‌

సహజ సంక్రమణ, వ్యాక్సిన్‌కు మధ్య హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు కరోనా వైరస్‌కు నిజమైన అంతమని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అన్నారు. 2021 చివరిలోపు కొవిడ్‌-19 గుర్తింపు, చికిత్సలో వినూత్న పద్ధతులు, వ్యాక్సిన్లు వస్తాయని ఆయన అంచనా వేశారు. దాంతో మరణాల సంఖ్య మరింత తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీకాలు అందరికీ అందుబాటులోకి రావాలని కేవలం ధనిక దేశాలకు మాత్రమే సొంతం కాకూడదని ఆయన  పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. AP:మళ్లీ పదివేలకుపైగా కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.86లక్షలు దాటింది. రెండురోజులపాటు కాస్త నెమ్మదించిన కరోనా మరోసారి పదివేల మార్క్‌ను తాకింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,128 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇవాళ మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 1,86,461కి చేరుకోగా.. 1,681 మంది మృతి చెందారు. ఇవాళ 8,729 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మోదీ, అయోధ్య, మూడు రికార్డులు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామజన్మభూమి అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి సబంధించిన భూమిపూజా కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనటం ద్వారా ప్రధాని ఒకే రోజు మూడు జాతీయ రికార్డులు సృష్టించటం గమనార్హం. నేటి కార్యక్రమం ద్వారా అయోధ్యలో రామమందిరాన్ని దర్శించిన తొలి ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. మహిమాన్వితమైనదిగా భావించే ఇక్కడి హనుమాన్‌ గడి మందిరాన్ని దేశ ప్రధానమంత్రి దర్శించటం కూడా ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.