close

తాజా వార్తలు

Published : 01/10/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. రైతుల కోసం ఆ దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధం!‌

వ్యవసాయ రంగం, రైతుల రక్షణ కోసం దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జల వివాదాలపై ఈ నెల 6న జరగబోయే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో అనుసరించాల్సిన వ్యూహంపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నీళ్లతో ముడిపడే తెలంగాణ ఉద్యమం సాగింది. గోదావరి, కష్ణా జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి చుక్కను వాడుకుంటాం. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి’’ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఈసారి మాడవీధుల్లోనే శ్రీవారి వాహనసేవలు

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈనెల 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను మాడవీధుల్లో నిర్వహించాలని.. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించాలని నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలను నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సీరం సర్వే-2 వివరాలు ప్రకటించిన ఎన్‌ఐఎన్‌

తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తిపై భారత వైద్యపరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌), జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) కలిసి ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సీరం సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. ఈ వివరాలను ఎన్‌ఐఎన్‌ విడుదల చేసింది. ఆగస్టు 26, 27 తేదీల్లో జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో రెండో విడత సర్వే నిర్వహించినట్టు తెలిపింది. మూడు జిల్లాల్లో మొత్తం 1309 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షించినట్టు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ముంబయి vs పంజాబ్

ఐపీఎల్ లీగ్ మ్యాచుల్లో మరో ఆసక్తిరమైన సమరం జరుగుతోంది. అబుదాబి వేదికగా ముంబయి, పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేస్తోంది.  ముంబయి బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నారు. లైవ్ బ్లాగ్ కోసం క్లిక్ చేయండి

5. ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: పేర్ని నాని

కరోనాతో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. విజయవాడలో మృతిచెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆయన చెక్కులు అందజేశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర సర్వీసుల అంశంపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు నడుస్తాయనే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అడగాలని మీడియా ప్రతినిధులకు పేర్ని నాని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. అలాంటి రోగుల్లో గుండెపోటు సాధారణమే!

కొవిడ్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావడం సాధారణమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా 80ఏళ్ల వయసు పైబడినవారిలో ఇలాంటి ముప్పు సహజమేనని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కొవిడ్‌ సోకిన వృద్ధుల్లో ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వయోవృద్ధుల్లో గుండెపోటు రావడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు 7లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 71,577 నమూనాలను పరీక్షించగా 6,751 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,00,235కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 41 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అహ్మద్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు స్వీయ నిర్బంధంలోకి ఉండాలి’ అని సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు అభిషేక్‌ సింఘ్వి మను, తరుణ గొగోయ్‌, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య తదితరులు కొవిడ్‌ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. తీగల వంతెనపైకి వీకెండ్‌లో వాహనాలకు ‘నో’ 

నగరంలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వారాంతాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వారాంతాల్లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలపై సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. అక్టోబర్‌ 1 నుంచి వచ్చిన మార్పులు తెలుసా?

మీ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు ఫ్రాడయ్యిందా? ఎక్కడో ఉండి మీ డబ్బులు కొట్టేశారా? ఇక నుంచి అలాంటి వాళ్ల ఆటలు సాగవు. ఎవరైనా అర్జంటుగా పదివేలు కావాలని కార్డు తీసుకుని లక్షల రూపాయలు వాడేశారా? ఇకపై అలాంటివీ కుదరవు. అలాంటి మోసాలకు అవకాశం లేకుండా మీ కార్డులను లాక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇదే కాదు వాహనదారుల ధ్రువపత్రాలు, టీవీల ధరలు, పెట్రోల్‌ పంపుల్లో చెల్లింపులకు సంబంధించి కొన్ని నిబంధనలు గురువారం నుంచే కొత్తగా అమల్లోకి వచ్చాయి. అవేంటో చూసేయండి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.