close

తాజా వార్తలు

Published : 20/09/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్షసూచన

తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా.. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సీఎం సూచన మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. శ్రీశైలం ఆనకట్ట వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌

శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ సుందర దృశ్యాల్ని చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరిగింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం లింగాలగట్టు నుంచి స్విచ్‌యార్డు వరకు రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రెండో టీ20: దిల్లీపై టాస్‌ గెలిచిన పంజాబ్‌  

టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో భాగంగా దుబాయి వేదికగా దిల్లీ, పంజాబ్‌ జట్లు తలపడతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. విజయం కోసం ఇరు జట్లు సై అంటే అంటున్నాయి. లైవ్ బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి

4. రామ్‌నాథ్‌జీ.. ఆ బిల్లులను ఆమోదించొద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు ఆమోదముద్ర వేయొద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కోరారు. రెండు వ్యవసాయ బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆ బిల్లులను వెనక్కి పంపాలని రాష్ట్రపతిని కోరారు. వ్యవసాయానికి సంబంధించి ‘ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు’ బిల్లులకు ఇవాళ పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీలో కరోనా..7,738 కొత్త కేసులు

ఏపీలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క రోజు వ్యవధిలో 70,455 నమూనాలను పరీక్షించగా.. 7,738 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనాబారిన వారి సంఖ్య 6,25,514కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 57 మంది కరోనాతో మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఫేస్‌బుక్‌కు ఇక చివరి నోటీసులు!

ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష పూరిత ప్రసంగాల విషయమై సెప్టెంబర్‌ 23లోగా విచారణకు హాజరు కావాలని భారత్‌లోని ఫేస్‌బుక్‌ సంస్థ ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్‌ మోహన్‌కు సూచించింది. ఈ మేరకు దిల్లీ శాంతి భద్రత కమిటీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. 10 రాష్ట్రాల్లోనే 77శాతం కేసులు!

దేశవ్యాప్తంగా కేవలం పది రాష్ట్రాల్లోనే కరోనా వైరస్‌ క్రియాశీల కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ మరోసారి స్పష్టంచేశారు. ప్రతి ఆదివారం సామాజిక మాధ్యమం ద్వారా ప్రజల ముందుకొస్తున్న హర్షవర్ధన్‌.. దేశంలో సామాజిక వ్యాప్తి ఉందా? అన్న ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా కేవలం పది రాష్ట్రాల్లోనే దాదాపు 77శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. 108ఎంపీ కెమెరాతో రెడ్‌మీ కొత్త ఫోన్‌

బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రెడ్‌మీ. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందిస్తుంది ఈ కంపెనీ. అయితే త్వరలో రెడ్‌మీ పెద్ద కెమెరాలతో బడ్జెట్‌ ధరలో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. 64, 108 మెగాపిక్సెల్‌ కెమెరాలతో ఈ ఫోన్లు వస్తున్నాయని విబో అనే టెక్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఈ మేరకు గౌగ్విన్‌, గౌగ్విన్‌ ప్రో పేరుతో రెండు కొత్త ఫోన్‌ మోడల్స్‌ను షావోమి రిజిష్టర్‌ చేసిందట. గౌగ్విన్‌లో 64ఎంపీ కెమెరా, గౌగ్విన్‌ ప్రోలో 108ఎంపీ కెమెరా ఇస్తారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. తెరుచుకోనున్న తాజ్‌మహల్

పర్యాటకులకు శుభవార్త. దేశానికే తలమానికంగా నిలిచిన తాజ్‌మహల్‌ ఆరునెలల తరువాత తెరుచుకోనుంది. సోమవారం నుంచి ఈ విశిష్ట కట్టడం సందర్శనకు అనుమతిస్తున్నట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం తెలిపారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్‌ సంరక్షకుడు అమర్‌నాథ్‌ గుప్తా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. గుంటూరు జిల్లా ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసిన కేంద్రం

గుంటూరు జిల్లా ఆస్పత్రిని కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో పాటు అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి మేరకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్‌కు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దిల్లీలో ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి గల్లా జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.