close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై కమిటీ

తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావం అంశంలో అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) కమిటీని నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై భాజపా నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై ఎన్జీటీలో ఇవాళ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఆ తీర్పుతో మరింత క్లారిటీ వచ్చింది:ఆర్మీచీఫ్‌

సైన్యంలో మహిళా అధికారులకు ‘కమాండ్‌ హోదా’ను ఇచ్చేలా మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత సైన్యాధిపతి నరవాణే స్వాగతించారు. పార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్‌ మంజూరు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సైన్యం మరింత బలోపేతమవుతుందన్నారు. లింగ సమానత్వం పాటించే విషయంలో సైన్యం ఇప్పటికే ముందుందన్న ఆయన.. తాజాగా తీర్పుతో ఈ విషయంలో ముందుకెళ్లేందుకు తమకు మరింత స్పష్టత వచ్చిందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కేసీఆర్‌ ఉద్యోగులను మోసం చేశారు: లక్ష్మణ్‌

ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు, రైతులు గుర్తొస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నికల తర్వాత మాటమార్చి ఉద్యోగులను సీఎం మోసం చేశారని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని.. ఆరు సంవత్సరాల్లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇవ్వలేదని లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. దేశం కోసం ఓపికతో ముందుకెళ్తున్నా: పవన్‌

దేశానికి సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీ స్థాపించానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేదని.. లక్ష్యం కోసం పనిచేస్తూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన ‘ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంట్‌’ సదస్సులో పవన్‌ మాట్లాడారు. భగత్‌సింగ్‌లాంటి వారు తనకు ఆదర్శమని చెప్పారు. ఓటములు ఎదురైనా దేశ సేవ కోసం ఓపికతో ముందుకు సాగుతున్నానని పవన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పన్ను భారం తగ్గించండి: సునీల్‌ మిత్తల్‌

సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికాం కంపెనీలపై పన్నులు, సుంకాల భారం తగ్గించాలని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల విషయంలో టెలికాం కంపెనీలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన నేపథ్యంలో ఆయన మంత్రితో భేటీ అయ్యారు. టెలికాం రంగంపై ఏజీఆర్‌ రూపంలో అసాధారణ రీతిలో సంక్షోభం వచ్చి పడిందని మిత్తల్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. ఆర్టికల్‌ 371 రద్దుచేసే ఉద్దేశంలేదు: అమిత్‌ షా

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్‌ 371ను రద్దుచేసే ఉద్దేశం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం  స్పష్టంచేశారు. అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని  పరిరక్షించేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని, ఆచార సంప్రదాయాలను పరిరక్షించేలా ఉన్న ఆర్టికల్‌ 371 ద్వారా అనేక ఈశాన్య రాష్ట్రాలకు లబ్ధిచేకూరుతోందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు

శివరాత్రి పండుగను పురస్కరించుకొని తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధానానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అందిస్తోన్న ఈ సేవలను పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. నేటి నుంచి 23వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. సైనిక దళ ప్రధాన కార్యాలయం తరలింపు

భారతీయ సైన్యానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాన్ని నూతన భవనంలోకి తరలించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. మిలిటరీ విషయాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ‘సైనిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ’ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు  రైసినా హిల్స్‌ లోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఇకపై కంటోన్మెంట్‌ ప్రాంతానికి మార్చనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. #Indian2: కమల్‌.. రూ.కోటి సాయం

‘భారతీయుడు-2’ సెట్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు కమల్‌ హాసన్‌ ఆర్థికసాయం ప్రకటించారు. ‘నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా తరఫు నుంచి రూ.కోటిని ఆర్థికసాయంగా అందిస్తాను. ఇది నష్టపరిహారం కాదు. మూడేళ్ల క్రితం నాకు యాక్సిడెంట్‌ జరిగింది. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబం జీవనం సాగించడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసు’ అని కమల్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చంద్రబాబుది ప్రజావంచన యాత్ర: రోజా

ప్రజాప్రతినిధులపై తెదేపా కార్యకర్తలు దాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. తెదేపా అధినేత చంద్రబాబు కుట్రతోనే రాజధాని ప్రాంతంలో తనపై దాడికి యత్నించారని ఆరోపించారు. గత ఐదేళ్లలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారని రోజా ఆరోపించారు. ఆయన చేస్తోంది ప్రజాచైతన్య యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.