close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/03/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలా?

* గత నాలుగేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్లతోపాటు, కొన్ని షేర్లలోనూ మదుపు చేస్తున్నాను. గత వారం రోజులుగా కరోనా ప్రభావంతో మార్కెట్‌ తగ్గుతూ వస్తోంది కదా. ఇది నాకు ఆందోళన కలిగిస్తోంది. నా పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలా? కొంతకాలం వేచి చూడాలా? మార్కెట్‌ మరింత దిద్దుబాటు జరిగాక, కొత్త పెట్టుబడులు పెడితే బాగుంటుందా?

- సునీల్‌
* మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉంటాయి. మార్కెట్‌ వివిధ దశల్లో కరోనా వైరస్‌ మొదటిదీ కాదు.. అలాగని చివరిదీ కాదు.. ఇలాంటి సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.. ఇలాంటప్పుడు మార్కెట్లు దిద్దుబాటు జరగడం సహజమే. ప్రస్తుత పరిస్థిత్తులో మార్కెట్‌ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని చూసి ఆందోళన అవసరం లేదు. కొత్త పెట్టుబడులకు మార్కెట్‌ ఇచ్చిన అవకాశంగా భావించాలి. మీరు దీర్ఘకాలిక మదుపరి అయితే.. దీన్ని అనుకూలంగా మార్చుకొని, దశల వారీగా మదుపు చేయండి. ఒక్కసారి మార్కెట్‌ పెరగడం ప్రారంభమైతే.. తిరిగి వృద్ధి పథంలోకి వెళ్లడానికి ఎక్కువ కాలం పట్టదనే చెప్పొచ్చు. అన్ని దశల్లోనూ మార్కెట్లో ఉండటానికి  క్రమానుగత పెట్టుబడి విధానంలో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించండి.


* నాకు నాలుగేళ్ల అబ్బాయి ఉన్నాడు. నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను. బాబు అవసరాల కోసం నెలకు రూ.6,000 పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కాస్త అధిక రాబడి ఆర్జించేందుకు ఉన్న అవకాశాలను తెలియజేయగలరు?

- శ్వేత
* ఒంటరి తల్లిగా మీ బాబు ఆర్థిక అవసరాలను తీర్చడంతోపాటు, అతని అవసరాలకు తగిన భద్రతనూ కల్పించాల్సిన అవసరం ఉంది. మీ బాబు చాలా చిన్న వయసులో ఉన్నాడు. ముందుగా మీరు మీ ఆస్తులకు బాబును వారసునిగా పేర్కొంటూ.. వీలునామా రాయండి. అతను మైనర్‌ కాబట్టి, ఒక సంరక్షకుడిని నియమించండి. మీకు అనుకోనిది ఏమైనా జరిగితే బాబుకు ఏ ఇబ్బందీ కలగకూడదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే.. మీరు దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందుకోస డీఎస్‌పీ ఈక్విటీ ఫండ్‌, యాక్సిస్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌, కోటక్‌ స్మాల్‌ క్యాప్‌ ఫండ్లను ఎంచుకోండి.


* నేను ఒక ఫ్లాటు కొనాలని ఆలోచిస్తున్నాను. వార్షికాదాయాన్ని బట్టి, ప్రభుత్వం ఇంటి కొనుగోలుపై వడ్డీ రాయితీ ఇస్తుందని విన్నాను. ఏడాదికి నా ఆదాయం రూ.11లక్షలు. నాకు ఎంత మేరకు రాయితీ లభిస్తుందో తెలియజేయగలరు?

- మహేశ్‌
* ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద కింద కొత్తగా ఇల్లు కొన్నవారికి వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. కుటుంబ ఆదాయాన్ని బట్టి, శ్లాబులుగా విభజిస్తారు. దంపతులిద్దరి ఆదాయం కలిసి రూ.11 లక్షల లోపు ఉంటే.. ఎంఐజీ-1 కిందకు వస్తారు. ఈ విభాగం కింద మీరు కొన్న ఫ్లాటు కార్పెట్‌ ఏరియా 160 చదరపు మీటర్లు, గరిష్ఠ రుణ వ్యవధి 20 ఏళ్లు ఉండాలి. ఇలాంటప్పుడు మీకు 4శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఇది మీ మొత్తం రుణంపై కాకుండా.. రూ.9లక్షలపైన మాత్రమే అందిస్తారు. అంటే.. మీరు ఈ పథకం కింద రూ.2,35,068 వరకూ రాయితీ పొందేందుకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మహిళలు సహ యజమానిగా ఉండటం తప్పనిసరి అని అడగవచ్చు. మీకు రుణం మంజూరు చేసిన బ్యాంకు ద్వారానే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి.

- సాయి కృష్ణ పత్రి,
సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.