close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/05/2020 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందువల్లే వైరస్‌ తీవ్రత అధికం: కేంద్ర మంత్రి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో సోమవారం ఉదయానికి 42వేల కేసులు నమోదుకాగా 1373 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 52శాతం కేవలం దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 13వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా దిల్లీ, గుజరాత్‌లలో దాదాపు 5వేల చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ సందర్భంలో దిల్లీ, ముంబయి వంటి నగరాల్లోని ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించకపోవడం వైరస్‌ తీవ్రత పెరగడానికి ఓ కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు, నగరాలతో పోలిస్తే ఈ నగరాల్లో లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటించలేదని స్పష్టమవుతోందని ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటినుంచి దేశవ్యాప్తంగా కొన్ని జోన్లలో లాక్‌డౌన్‌ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. అయితే, దిల్లీలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా లాక్‌డౌన్‌ సడలింపులు కొంతవరకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ సమయంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దిల్లీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ముంబయిలో 8613కేసులు, 343 మరణాలు 

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా వైరస్‌ తీవ్రత కలవరపెడుతోంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 20శాతం ఇక్కడే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ముంబయిలో 8,613 కరోనా కేసులు నమోదుకాగా 343 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడ 548మంది ఈ వైరస్‌ సోకి మరణించారు. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో కరోనా వైరస్‌ తీవ్రతకు మహారాష్ట్ర ప్రభుత్వ తీరే కారణమని పంజాబ్‌ ఆరోగ్యశాఖ మంత్రి బల్బిర్‌ సింగ్‌ సింధూ ఆరోపించారు. నాందేడ్‌ నుంచి పంజాబ్‌ బయలుదేరిన యాత్రికులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించకపోవడం వల్లే పంజాబ్‌లో వైరస్‌ తీవ్రత పెరిగిందన్నారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించడం లేదనే సమాచారం కూడా పంజాబ్‌ ప్రభుత్వానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు పంజాబ్‌లో 1102 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా వీరిలో 21మంది మరణించారు. 

ఇవీ చదవండి..

చైనా అందుకే నిజాన్ని దాచిపెట్టిందా!

మద్యం దుకాణాల వద్ద బారులు..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.