close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120048792 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B-1Fg2PD5Fg [video_short_link] => B-1Fg2PD5Fg [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-11 19:06:20.508613 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 11/04/2020 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రతి కోతికో రోజొస్తుంది: టిస్కా చోప్రా

వైరల్‌ అవుతున్న కోతుల స్విమ్మింగ్‌ వీడియో

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే గడుపతున్నారు. దీంతో రోడ్లతోపాటు అనేక ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఈ మధ్యే నొయిడా వీధుల్లో మనుబోతు తిరుగుతూ కనిపించింది. ఉత్తరాఖండ్‌లోని ఓ సొసైటీ వద్ద సాంబార్‌ జింక దర్శనమిచ్చింది. తాజాగా ముంబయి బోరివాలిలోని ఓ ఈత కొలనులో కొన్ని కోతులు ఈత కొడుతూ సరదాగా గడిపిన ఓ వీడియోను బాలీవుడ్‌ నటి, నిర్మాత టిస్కా చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఉంచగా ఇప్పుడు అది వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఓ కోతి ఓ ఇంటి బాల్కనీలోని రెయిలింగ్‌పై నుంచి ఈత కొలనులో అమాంతం దూకి  హాయిగా ఈత కొడుతూ ఉంటుంది. కొద్దిసేపటికి మరికొన్ని కోతులు కూడా దానికి తోడు కలుస్తాయి. మరో కోతి కిటికీ వద్ద కూర్చొని ఈ దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది.

టిస్కా చోప్రా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి ‘ఈ అవకాశం కోసమే కొన్నేళ్లుగా నిరీక్షిస్తూ ఉన్నట్టున్నాయి. నరైన సమయం చూసి పార్టీ చేసుకుంటున్నాయి. ప్రతి కోతికీ ఓ రోజు వస్తుంది’. అంటూ ఫన్నీగా పోస్టు చేసింది. కాగా ఆమె పోస్టు చేసిన గంటల్లోనే లక్షకు పైగా నెటిజన్లు ఆ వీడియోను వీక్షించి వారు సైతం ఫన్నీగా స్పందించారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.