గంభీర్‌ కెరీర్‌ ముగింపుపై ఎందుకలా అన్నానంటే?
close

తాజా వార్తలు

Published : 13/08/2020 16:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంభీర్‌ కెరీర్‌ ముగింపుపై ఎందుకలా అన్నానంటే?

కోహ్లీ, గౌతీలపై మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కెరీర్‌ తనవల్లే ముగిసిపోయిందని గతేడాది సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ తాజాగా దానికి వివరణ ఇచ్చాడు. ఇటీవల అతడు సవేరా పాషా అనే క్రికెట్‌ వ్యాఖ్యాతతో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ తన గురించి, టీమ్‌ఇండియా క్రికెటర్ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2012లో భారత పర్యటనకు వచ్చిన ఈ పాక్‌ పేసర్‌.. ఎత్తు ఎక్కువగా ఉండడంతో తన బౌన్సర్లతో అప్పుడు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఈ సందర్భంగా నాటి సిరీస్‌పై స్పందిస్తూ తొలుత తన బౌలింగ్‌ గురించి విరాట్‌ కోహ్లీ ఏమన్నాడో గుర్తుచేసుకున్నాడు. 

ఆ పర్యటనలో భారత కోచ్‌లు తన గురించి టీమ్‌ఇండియా ఆటగాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పాడు. అది స్వయంగా కోహ్లీయే తనతో చెప్పాడన్నాడు. ‘నేను కేవలం 130-135 కిమీ వేగంతో మాత్రమే బంతులేస్తానని, నా హైట్‌ ఎక్కువగా ఉండడంతో అవి బౌన్స్‌ అవుతాయని, అది తప్పితే పెద్దగా ఇబ్బంది పెట్టనని టీమ్‌ఇండియా కోచ్‌లు ఆటగాళ్లకు చెప్పారు. ఒకసారి నేను ప్రాక్టీస్‌ చేస్తుండగా కోహ్లీ పక్కనే ఉన్నాడు. అతడి ముందు ఒక బంతి వేయగా అది 145 కిమీ వేగంతో పడింది. మొదట స్పీడ్‌గన్ ఆ బంతి వేగాన్ని తప్పుగా చూపించిందేమో అనుకున్నాడు. తర్వాత బంతి 147 కిమీ వేగంతో పడింది. దాంతో నా బౌలింగ్‌ గురించి తమ కోచ్‌ అబద్ధం చెప్పాడేమోనని, దాని గురించి అతడిని అడుగుతానని కోహ్లీ నాతో అన్నాడు. ఇక తర్వాత కూడా నేను 148 కిమీ వేగంతో బంతి సంధించడంతో పక్కనున్న ఆటగాడితో నేను మామూలు బౌలర్‌ కాదని చెప్పాడు’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. 

అనంతరం గంభీర్‌ కెరీర్‌పై నిరుడు చేసిన సంచలన వ్యాఖ్యల గురించి వ్యాఖ్యాత ప్రశ్నించగా ఇర్ఫాన్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో ఎవరు సరిగ్గా ఆడకపోయినా వాళ్లు జీరోలు అవుతారు, బాగా ఆడిన వాళ్లు హీరోలు అవుతారు. ఇక ఆ సిరీస్‌లో నేను వేసిన బంతులను గంభీర్‌ చూడలేకపోయాడు. నా బౌలింగ్‌ను అతడు సరిగ్గా ఎదుర్కోలేకపోయాడు. దాంతో అతడు గంభీర్‌ కాదని బయటి వాళ్లు అనుకున్నారు. ఎందుకంటే అతడు చాలా మంచి బ్యాట్స్‌మన్‌. కానీ ఆ సిరీస్‌లో రాణించలేదు. మరోవైపు నేను ఎక్కువ హైట్‌ ఉండడంతో నా బౌలింగ్‌పై చాలా అంచనాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ నా బౌలింగ్‌లో సరిగ్గా ఆడకపోయేసరికి నేనెలా వ్యాఖ్యానించాను. ఆ సిరీస్‌ తర్వాత అతడు‌ మళ్లీ టీమ్ఇండియాలోకి రాలేదు. తర్వాత కొన్ని మ్యాచ్‌లే ఆడినా సరిగ్గా పరుగులు చేయలేకపోయాడు. కాబట్టి 2012లో మాతో ఆడిందే అతడి చివరి సిరీస్‌ అని నేను భావించా’ అని ఇర్ఫాన్‌ స్పష్టం చేశాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని