మీ దాతృత్వాన్ని చాటుకునే సమయమిదే!
close

తాజా వార్తలు

Published : 29/03/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ దాతృత్వాన్ని చాటుకునే సమయమిదే!

దిల్లీ: ప్రపంచాన్ని తన విషపుకోరలతో బెంబేలెత్తుస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడుతున్నారు. ఈ సమయంలోనే కొందరు ప్రముఖులు, సినీతారలు తమ వంతు సాయం చేస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఆకలిచావులు లేకుండా ప్రజలను కాపాడేందుకు సేవాభావం ఉన్న వ్యక్తులు తమ దాతృత్వాన్ని చాటుకోవాలన్నారు. శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి పౌర సహాయనిధికి(పీఎమ్ కేర్స్‌ ఫండ్‌) విరాళాలు అందజేయాలన్నారు.

దాతలు తమ విరాళాల్ని యూపీఐఐడీ, క్రెడిట్, డెబిట్‌, ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ ఏ రూపంలోనైనా ఇవ్వవచ్చునన్నారు. అది స్వల్ప మొత్తమైనా ఫర్వాలేదని, ఆ విరాళాలు ఈ విపత్తును ఎదుర్కొనటానికి తగిన శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. అందరం తలో చెయ్యి వేసి కొవిడ్‌-19ను అంతమొందించి భావితరాలకు ఒక ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని ఇద్దామని ట్విటర్‌ ద్వారా సందేశమిచ్చారు. ఈ విపత్తును ఎదుర్కొనటానికి టాటా సంస్థల తరుఫున రతన్‌టాటా రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని