
తాజా వార్తలు
‘మాపై కాదు.. కేంద్రంపై వేయాలి ఛార్జ్‌షీట్’
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: నగరానికి ఇప్పుడు కావాల్సింది ఛార్జ్షీట్లు కాదని.. అభివృద్ధి షీట్లని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆరేళ్లలో తెరాస 60 వైఫల్యాలంటూ భాజపా నేతలతో కలిసి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఛార్జ్‌షీట్ విడుదల చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు ఏం చేస్తారో చెప్పాలి కానీ.. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, తెలంగాణను అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ వేస్తారా? అని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పినందుకు కేంద్ర ప్రభుత్వంపైనే ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని మంత్రి వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలిస్తే ప్రభుత్వరంగ సంస్థలతో పాటు హైదరాబాద్‌నూ అమ్మేస్తారని విమర్శించారు. శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భాజపాలోకి వెళ్లారని వస్తున్న వార్తలపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. స్వామిగౌడ్ ఎప్పటికీ భాజపాలోకి వెళ్లరని ధీమా వ్యక్తం చేశారు. మామూలు స్థాయిలో ఉన్న తనను ప్రోటోకాల్ స్థానంలో సీఎం కేసీఆర్ కూర్చోబెట్టారని స్వామిగౌడ్ గతంలో అన్నారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
గ్లోబల్ సిటీ అని...ఫ్లడ్ సిటీగా మార్చారు
ప్రకాశ్ జావడేకర్పై రేవంత్‌రెడ్డి ఛార్జ్‌షీట్!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్‌తో పోల్చాలంటే భయమేస్తోంది: ఛాపెల్
- అఖిలప్రియకు చంద్రబాబు ఫోన్
- నిజమైన స్నేహానికి అర్థం భారత్: అమెరికా
- పంత్ వచ్చి టీమ్ ప్లాన్ మొత్తాన్ని మార్చేశాడు
- రివ్యూ: బంగారు బుల్లోడు
- అతడి స్థానంలో పంత్‌కు చోటు ఇవ్వండి
- మరో కీలక ఆదేశంపై బైడెన్ సంతకం
- సంజూని కెప్టెన్ కాకుండా వైస్‌కెప్టెన్ చేయాల్సింది
- వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్ఈసీ
- టెస్టు ఛాంపియన్షిప్: భారత్ పరిస్థితేంటి?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
