close

తాజా వార్తలు

Published : 12/07/2020 14:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సాయం అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కొవిడ్‌ సేవలందిస్తున్న ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల కోసం రూ.265 కోట్లు విడుదల చేశామని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు కేంద్ర మంత్రికి వివరించారు. అన్ని వార్డుల్లో కలియతిరిగి కోవిడ్‌ పీడితులకు ధైర్యం చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఉద్బోధించారు.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని